Site icon HashtagU Telugu

Pending Challans: పెండింగ్ చలాన్ల ఆఫర్‌ నేటితో ముగింపు!

Challan

Challan

హైదరాబాద్‌: వాహనదారులకు తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ల ఆఫర్‌ నేటితో ముగియనుంది. మార్చి ఒకటి నుంచి పోలీసులు ఈ ఆఫర్‌ ప్రకటించారు. ముందుగా మార్చి నెలాఖరు వరకే ఈ ఆఫర్ ఉండగా.. ఆ తర్వాత ఏప్రిల్‌ 15 వరకు దాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్‌ 16 నుంచి యథావిధిగా చలాన్‌ రుసుము వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు 60 శాతం వాహనదారులు చలాన్‌లు క్లియర్ చేసుకున్నారు. దాదాపు రూ. 250 కోట్లను ఫైన్ రూపంలో చెల్లించారు. అయితే మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదని పోలీసులు స్పష్టం చేశారు.