Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 238 మంది మరణించగా, 900 మంది గాయపడ్డారు. కాగా కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అంతకుముందు పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీకి అధికారులు సమాచారం అందించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు
మరోవైపు ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. తనకు చాలా బాధగా బాధగా ఉందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదిలా ఉండగా ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంతో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు శ్రీలంక విదేశాంగ మంత్రి కూడా సంతాపం తెలిపారు.
Read More: Odisha Train Accident: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి… రైలు ప్రమాదంలో హృదయవిదారక ఘటన