Site icon HashtagU Telugu

Minister Injured In Firing: బ్రేకింగ్.. మంత్రిపై దుండగుల కాల్పులు

Minister Naba Das

Resizeimagesize (1280 X 720) (2) 11zon

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబా దాస్‌ (Minister Naba Das)పై దుండగులు కాల్పులు జరిపారు. బ్రెజిరానగర్‌లోని గాంధీ చౌక్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నబా దాస్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నబా దాస్ వాహనం దిగిన తర్వాత గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారని వర్గాలు తెలిపాయి. కాల్పుల వెనుక కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన తర్వాత నబా దాస్‌ను ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనతో బీజేడీ కార్యకర్తలు ధర్నా చేయడంతో ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది.

Also Read: Murder : ఢిల్లీలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. వివాహేత సంబంధ‌మే కార‌ణ‌మా..?