Leopard: బావిలో నుంచి శబ్దాలు.. దగ్గరకి వెళ్లి చూసిన జనాలకు షాక్?

  • Written By:
  • Updated On - June 9, 2022 / 04:22 PM IST

తాజాగా ఒడిశా రాష్ట్రంలోని సంబాల్ పూర్ జిల్లాలో సమీపంలోని హిందాల్ ఘాట్ లో బావిలో పడిన ఒక చిరుతపులిని అటవీశాఖ అధికారులు చాకచక్యంగా బయటకు తీసి కాపాడారు. హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రానికి చిరుత పులి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అక్కడున్న ఒక బావిలో పడిపోయింది. అయితే పడిన బావి లోతు గా ఉండటం అందులో నీళ్ళు కూడా ఉండటంతో పైకి ఎక్కే అవకాశం లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే బావిలోనుంచి చిరుత పెద్ద పెద్దగా గా నడుస్తూ ఉండటంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఆ చిరుత పులి ని చూసి భయంతో పరుగులు తీశారు. అయితే కొందరు వ్యక్తులు ఆ చిరుత పులి ని చూసి వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు.

 

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మొదట అగ్నిమాపక సిబ్బంది తాళ్లతో బయటకు తీయాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరికి నిచ్చెన సహాయంతో చిరుతను బయటికి తీయగలిగారు. నిచ్చెన సహాయంతో బయటకు వచ్చిన చిరుత పులి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఆ చిరుతపులిని చూసిన గ్రామస్తులు ఎక్కడ తమకు హాని కలిగిస్తుందో అని భయంతో పరుగులు తీశారు.