Site icon HashtagU Telugu

ఆ గ్రామంలో పేదలకు ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్న డాక్టర్..!

7b9krrei

7b9krrei

సాధారణంగా డాక్టర్లను దేవుళ్లు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఎంతో క్లిష్ట పరిస్థితులలో ధైర్యం చేసి చికిత్సను అందించి ప్రాణాలను నిలబెడుతూ ఉంటారు. మామూలుగా ఏదైనా ఆపరేషన్ కానీ వైద్యసేవలు కోసం డాక్టర్ దగ్గరికి వెళితే వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు అవుతూ ఉంటాయి. కానీ ఈ డాక్టర్ మాత్రం కేవలంఒక్క రూపాయికే వైద్య సేవలను అందిస్తున్నారు. ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన శంకర్‌ రామచందని అక్కడి బుర్లా అనే ప్రాంతలో ఉన్న వీర్‌ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ అనే ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే గతంలో ఆయన అక్కడే సీనియర్‌ రెసిడెంట్‌గా ఉన్నాడు. కానీ ఆ బాధ్యతల్లో ఉంటే సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్‌ పెట్టేందుకు వీలు లేదు. అందువల్ల ఆయన 1 హాస్పిటల్‌ పెట్టలేకపోయాడు. అయితే ఇటీవలే ఆయనకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. దీంతో ఆ పదవిలో ఉంటే ప్రైవేటు ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు. కనుక ఆయన తన ఇంట్లోనే కేవలం ఒక రూపాయికి క్లినిక్‌ను ప్రారంభించారు. ఇటీవలే ఆ క్లినిక్ ను ప్రారంభించగా నిత్యం ఎంతో మందికి వైద్య సేవల కోసం వస్తున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన క్లినిక్‌ ఉంటుంది.

అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి బాగా వైరల్ అవడంతో ఇదే విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయాడని, ఆయన చనిపోయేందుకు ముందు ప్రైవేట్‌ క్లినిక్‌ పెట్టుకోమని సలహా ఇచ్చాడని, కానీ ఆ క్లినిక్‌ పెడితే పేదలకు ఇలా 1కే వైద్యం చేయలేనని చెప్పానని, కనుకనే ప్రైవేటు హాస్పిటల్‌ను పెట్టలేదని తెలిపాడు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకే తాను ఇంట్లోనే క్లినిక్‌ను ఏర్పాటు చేశానని తెలిపాడు. ఇక 1 ఎందుకు అడగగా అంత మొత్తం కూడా ఇవ్వకుండా వైద్యం అందించవచ్చు. కానీ వైద్యం కోసం వచ్చే వారికి మరీ ఉచితంగా సేవలు పొందడం కూడా ఇష్టం ఉండదు. అందుకే 1 అయితే తాము ఎంతో కొంత చెల్లించే వైద్య సేవలు పొందుతున్నామనే భావన కలుగుతుంది. ఉచితంగా వైద్యం పొందడం లేదని అనుకుంటారు. ఇది వారిని సంతృప్తిగా ఉంచుతుంది. అందుకనే 1 తీసుకుంటున్నా.. అని తెలిపారు.