Numaish: నేడే హైదరాబాద్ లో నుమాయిష్ ప్రారంభం

Numaish: కొత్త సంవత్సరంలో సిటీ జనాలకు నుమాయిష్ అందుబాటులోకి వస్తుంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ తన 83వ సీజన్‌కు సిద్ధంగా ఉంది. జనవరి 1, 2024 నుండి ఫిబ్రవరి 15, 2024 వరకు ఉంటుంది. 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ కు దేశవ్యాప్తంగా వ్యాపారులకు వేదికగా మారనుంది. ఎనిమిది దశాబ్దాలకు పైగా నుమాయిష్ వార్షిక ఈవెంట్‌గా జరుగుతోంది. బట్టలు, ఆహారం, ఉపకరణాలు, ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లక్షలాది […]

Published By: HashtagU Telugu Desk
Numaish

Numaish

Numaish: కొత్త సంవత్సరంలో సిటీ జనాలకు నుమాయిష్ అందుబాటులోకి వస్తుంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ తన 83వ సీజన్‌కు సిద్ధంగా ఉంది. జనవరి 1, 2024 నుండి ఫిబ్రవరి 15, 2024 వరకు ఉంటుంది. 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ కు దేశవ్యాప్తంగా వ్యాపారులకు వేదికగా మారనుంది. ఎనిమిది దశాబ్దాలకు పైగా నుమాయిష్ వార్షిక ఈవెంట్‌గా జరుగుతోంది. బట్టలు, ఆహారం, ఉపకరణాలు, ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు.

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ వనం సత్యేందర్ మాట్లాడుతూ.. “నుమాయిష్‌ను గ్రాండ్‌గా నిర్వహించడానికి AIIE సొసైటీ సన్నద్ధమైంది. ఈ ఏడాది సొసైటీకి దేశం నలుమూలల నుంచి వ్యాపారుల నుంచి 3,500కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే 2,500లకు పైగా స్టాళ్లను వ్యాపారులకు కేటాయించారు. ఇవాళ ప్రారంభం కాబోయే నుమాయిష్ ను సీఎం రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభిస్తారు.

  Last Updated: 01 Jan 2024, 12:40 PM IST