Site icon HashtagU Telugu

Numaish Telangana : నుమాయిష్ ఈ రోజు ప్రారంభం కానుంది

Numaish Is Going To Start Today

Numaish Is Going To Start Today

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Numaish) ఈ రోజు ప్రారంభం కానుంది. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన 83వ నుమాయిష్ విజయవంతం అవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం చెప్పారు. కరోనా కారణంగా నుమాయిష్ నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు.

నుమాయిష్ లో ఈసారి మొత్తం 2,400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు అశ్విని చెప్పారు. సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్ తో పాటు వైద్య శిభిరం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రవేశ రుసుమును పెద్దలకు రూ.40 గా నిర్ణయించామని, ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు. నుమాయిష్ (Numaish) లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాళ్లు ఉన్నాయని, పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్ మెంట్ పార్క్ ను రెడీ చేశామని వివరించారు.

ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ప్రదర్శన జరుగుతుందని అశ్విని తెలిపారు. కరోనా భయం పెద్దగా లేకపోవడంతో ఈసారి నుమాయిష్ కు భారీ సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Also Read:  Twitter : ట్విట్టర్ హెడ్డాఫీసు పై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేసిన యజమాని