అన్న క్యాంటీన్లు (Anna Canteen) కాకుండా డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు (Dokka Seethamma Canteen) ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ (AP Govt) సిద్దమైందనే వార్తలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
మావోయిస్టులపై మరో ఏడాదిపాటు నిషేధం పొడిగింపు
పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217,144 జీఓలు రద్దు
నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం
కొత్త మద్యంపాలసీ రూపకల్పన
రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు
జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుని రాజముద్ర ఉన్న పాసు పుస్తకాలు ఇవ్వడం
త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ
జిల్లాల్లో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం
సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తీర్మానం
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక ఈ సమావేశం అనంతరం ఆగస్టు 15 న రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లను ప్రారభించబోతున్నారు. ఈ క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు అని కొనసాగించాలా, లేక డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే చర్చ రాగా దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 2019 వరకు ఉన్న విధంగానే అన్న క్యాంటీన్లు అని కొనసాగించాలని సూచించారు. అపర అన్నపూర్ణగా ఖ్యాతి గాంచిన డొక్కా సీతమ్మ పేరు పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో… క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరు కొనసాగించవచ్చని పవన్ ప్రతిపాదించారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు సబబుగా ఉంటుందని, ప్రభుత్వం నిర్వహించే క్యాంటీన్లను ఎన్టీఆర్ పేరుతో కొనసాగించాలని స్పష్టం చేశారు.
Read Also : Minister Seethakka: మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్..!