Jr NTR Speech : దుబాయ్ లో శుక్రవారం రాత్రి జరిగిన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ సినిమాకుగానూ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీముడిగా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఇక సైమా ఫంక్షన్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ మళ్లీ తనను నమ్మిన జక్కన్న (దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి)కు ఈసందర్భంగా ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’లో తనతో పాటు నటించిన రామ్ చరణ్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు. రామ్ చరణ్ ను బ్రదర్ అని ఎన్టీఆర్ పిలిచారు.
Also read : Bangladesh Beats India: బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే..?
ఆ తర్వాత అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన జూనియన్ ఎన్టీఆర్.. ‘‘నా ఒడిదుడుకుల్లో.. నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపింది మీరే. నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధపడ్డారు.. నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వారు.. నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు’’ అని ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. దాన్ని ఆపేసి దుబాయ్ లో జరుగుతున్న సైమా ఫంక్షన్ కు వెళ్లారు. ‘దేవర’ మూవీలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దేవర’ పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ.. జాన్వీకి తొలి తెలుగు సినిమా. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను (Jr NTR Speech) పోషిస్తున్నారు.