NTR 30: ఎన్టీఆర్-కొరటాల కాంబో.. ఫుల్ మాస్ డోస్!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Jr Ntr And Siva

Jr Ntr And Siva

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ 30వ సినిమాను భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తామని, ఫుల్ మాస్ డోస్ ఉంటుందని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. భారీ స్క్రిప్ట్‌ రాసుకున్నామని, ఇందులో ప్రభాస్‌ మిర్చి సినిమా కంటే ఎక్కువ మాస్‌ ఎలిమెంట్స్‌, కమర్షియల్‌ అంశాలు ఉంటాయని అన్నారు. ఎన్టీఆర్ 30కి సంబంధించిన మరిన్ని వివరాలను మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారని అంటున్నారు. ఈ చిత్రం జూన్ 2030లో తెరపైకి రానుంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కలిసి నటించిన జంట గ్యారేజ్ సూపర్ హిట్ చిత్రం. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో ఆచార్య మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదల రోజే మిక్స్ డ్ టాక్ వినిపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 29 Apr 2022, 05:48 PM IST