JR NTR : నందమూరి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎన్టీఆర్..మోక్షజ్ఞ

ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ , బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

Published By: HashtagU Telugu Desk
nandamuri Sri Harsha wedding

nandamuri Sri Harsha wedding

దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష (Sri Harsha) వివాహ వేడుక (Nandamuri Suhasini son Marriage) ఆదివారం హైదరాబాదులోని గచ్చిబౌలిలో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, నారా వారి కుటుంబ సభ్యులు , పలువురు సినీ , రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నారా చంద్రబాబు (Chandrababu )… తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి ఈ పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

ఇక ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ (NTR) , బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ కలిసిన సమయాలు చాల తక్కువ. అంతే కాదు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా పెద్దగా బయట కనపడలేదు. అలాంటిది ఈ వివాహ వేడుకలో ఇద్దరు కలుసుకోవడం , మాట్లాడుకోవడం , కలిసి ఫొటోస్ కు పోజులు ఇవ్వడం తో అంత వీరి గురించే మాట్లాడుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ చూసి నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇదిగో..అదిగో అంటున్నారు తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడో అనేది మాత్రం చెప్పడం లేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ట్రై చేస్తున్నాడని , నటన , డాన్సులు, యాక్షన్ సన్నివేశాల ట్రేనింగ్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే..ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుండగా..విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

Read Also : Army Jawan Died : లద్దాఖ్‌ ప్రమాదంలో తెలంగాణ జవాన్‌ మృతి

  Last Updated: 21 Aug 2023, 09:42 AM IST