Site icon HashtagU Telugu

Koratala Siva: శివా.. టేక్ యువర్ ఓన్ టైం!

Ntr30

Ntr30

ఏ దర్శకుడికైనా కెరీర్ డౌన్ కావడానికి ఒక్క ఫ్లాప్ చాలు. అగ్ర దర్శకుడు కొరటాల శివ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ‘ఆచార్య’ ఘోర పరాజయం శివను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మానసిక వేదనకు లోనయ్యేలా చేసింది. ఆచార్య ఫలితాన్ని మరిచిపోవాలంటే ఆయన వెంటనే భారీ హిట్ ను అందుకోవాలి. అందుకే తాను నెక్ట్స్ తీయబోయే ఎన్టీఆర్ (#NTR30) సినిమాపై ఆశలు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కొరటాల శివ రీసెంట్‌గా ఎన్టీఆర్‌ని కలిసి స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరాడట

కథ ఇప్పటికే ఫైనల్ అయ్యింది. అయితే కొరటాల కొన్ని మార్పులు చేయడానికి తగినంత సమయం తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా దర్శకుడు పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ రాసుకున్నాడు. కొరటాల డిమాండ్‌కు ఎన్టీఆర్ కూడా వెంటనే అంగీకరించాడు. జూలై, ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ప్రకటించనున్నారు. “ఆచార్య” ఫలితంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నా కొరటాల శివ ఇక ఆశలన్నీ ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టుకున్నాడు.

Exit mobile version