NTR Coin for Sale : ఆన్లైన్ లో ఎన్టీఆర్ నాణెం..ధర ఎంతో తెలుసా..?

ఈ నాణేం (NTR Coin) అసలు ధర మాత్రం రూ.3500 నుంచి రూ. 4,850 వరకు ఉంటుందని హైదరాబాద్ మింట్ అధికారులు చెబుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Ntr Coin Price

Ntr Coin Price

NTR Coin for Sale : నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేతుల మీదుగా ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న వంద రూపాయల నాణేన్ని (NTR ₹100/- coin) విడుదల చేశారు. ఈ స్మారక నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ లోనే తయారు చేస్తున్నారు. ఈ నాణెం తయారీలో నాలుగు లోహాల మిశ్రమాన్ని ఉపయోగించినట్లు హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ నాణెంలో 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు.

Read Also : Delhi CEC : TDP, YCPప‌ర‌స్ప‌ర ఫిర్యాదు!YCP ర‌ద్దుకు CBN డిమాండ్!!

ఈ స్మారక నాణేలు మార్కెట్లో చలామణిలో ఉండవు. కేవలం ఎన్టీఆర్ (NTR ) గుర్తుగా దాచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతాయి. ఇక ఈ నాణేం అసలు ధర మాత్రం రూ.3500 నుంచి రూ. 4,850 వరకు ఉంటుందని హైదరాబాద్ మింట్ అధికారులు చెబుతున్నారు. ఈ నాణేన్ని కావాలనుకునే వారు అడిగిన విధంగా ప్యాకింగ్ చేసి అందిస్తారు కాబట్టి.. ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని మింట్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ స్మారక నాణెం తయారీకి కూడా సుమారు రూ. 4 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. తొలి విడతలో 12వేల స్మారక నాణేలు ముద్రించామన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం కావాలనుకునే వారు ఆన్‌లైన్‌ తో పాటు హైదరాబాద్ లోని 3 చోట్ల కొనుగోలు చేయవచ్చు. సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ తో పాటు చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియం వద్ద వీటిని అమ్మకానికి పెట్టారు. ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఎన్టీఆర్ స్మారక నాణేలను కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ (NTR Coin Online link) కొనాలనుకున్నవారు ఈ లింక్ క్లిక్ చేసి..ఇందులో ఆర్డర్ పెట్టుకొచ్చు.

https://www.indiagovtmint.in/en/commemorative-coins/

  Last Updated: 29 Aug 2023, 10:35 AM IST