Site icon HashtagU Telugu

Power Issue: ఏపీకి NTPC విద్యుత్ నిలిపివేత

మిగులు విద్యుత్ ఉన్న ఏపీ అంధ కారంలోకి వెళ్లనుంది. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్ కోతలను పెట్టింది. అధికారికంగా ఇంకా ప్రకటించి లేనప్పటికీ కోతలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ ను నిలిపివేసింది.తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో.. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో అప్రమత్తమైన రాష్ట్ర అధికారులు..

విద్యుత్ లోటును ఆర్.టి.పి.పి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. మరో యూనిట్‌ను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే అందుకు సరిపడా బొగ్గు నిల్వలు లేవని ఆర్.టి.పి.పి స్పష్టం చేయడంతో…ఇందనశాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. కాగా ప్రస్తుతం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version