Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబు అరెస్టు పరిణామాలపై కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్‌జీ నివేదిక

Chandrababu3

Chandrababu3

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ ప‌రిణామాల‌పై కేంద్ర హోంశాఖ‌కు ఎన్ఎస్‌జీ నివేదిక‌ను స‌మ‌ర్పించింది. జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌లిగిన వ్య‌క్తిని అరెస్ట్ చేసే స‌మ‌యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును నివేదిక‌లో పేర్కొంది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్, జైలులో భద్రతకు సంబంధించిన విష‌యాల‌ను ఎన్ఎస్‌జీ కేంద్ర‌హోంశాకు నివేదించింది. నంద్యాల నుంచి విజ‌య‌వాడ‌కు చంద్రబాబును రోడ్డు మార్గంలో తరలించిన అంశాన్ని ఎస్ఎస్‌జీ త‌న నివేదిక‌లో ప్ర‌స్తావించింది. భద్రత పటిష్ఠంగా లేని ఏసీబీ కోర్టు హాల్ వద్ద చంద్రబాబును ఉంచారని.. వర్షంలోనే రాజమండ్రి జైలుకు చంద్రబాబును తరలించారని ఎన్ఎస్‌జీ నివేదికలో పేర్కొంది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ప్రస్తుత భద్రత అంశాన్ని కూడా ఎన్ఎస్‌జీ ప్ర‌స్తావించింది. జైలు ఆవరణలోకి వెళ్తున్నప్పుడు భద్రతా లోపాలు గుర్తించామని కేంద్ర హోంశాఖ, ఎన్ఎస్‌జీ ప్రధాన కార్యాలయానికి ఎన్ఎస్‌జీ అధికారులు నివేదిక సమర్పించారు