Subhash Chandra Bose: స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం. శాంతితో పోరాటం చేస్తే దేశానికి స్వాతంత్య్రం రాదని నమ్మిన వ్యక్తి నేతాజీ. దీంతో దేశానికి సైనికులను తీర్చి దిద్ది బ్రిటీష్ వాళ్ళని తరిమికొట్టిన పోరాట పటిమ ఆయన సొంతం. తాజాగా సుభాష్ చంద్రబోస్ సేవలను గుర్తు చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.
#WATCH | Netaji (Subhas Chandra Bose) said I will not compromise for anything less than full independence and freedom. He said that he not only wants to free this country from political subjugation but there is a need to change the political, social and cultural mindset of the… pic.twitter.com/2iIQYF993T
— ANI (@ANI) June 17, 2023
శనివారం ఢిల్లీలో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రసంగించారు. నేతాజీని స్మరించుకుంటూ సుభాష్ చంద్రబోస్ భారతీయులు పక్షుల్లా స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకున్నారని గుర్తు చేసుకున్నారు. నేతాజీ దేశం కోసం అస్సలు కాంప్రమైజ్ కాలేదని ఆయన సేవలను కొనియాడారు. నేతాజీ ఈ దేశాన్ని రాజకీయ బానిసత్వం నుండి విముక్తి చేయడమే కాకుండా, ప్రజల రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉందని, వారు ఆకాశంలో స్వేచ్ఛా పక్షులుగా జీవించాలని అనుకున్నారని దోవల్ అన్నారు. నేతాజీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ సుభాష్ చంద్రబోస్ వారసత్వం అసమానమైనదని అన్నారు. (Netaji)
దోవల్ ఇంకా మాట్లాడుతూ… నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేయాలని మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా సాంకేతిక ఆవిష్కరణలను తీసుకురావాలని చెప్పారు. అత్యంత ప్రేరణ, నిబద్ధత కలిగిన మానవ వనరులు దేశానికి అతిపెద్ద శక్తి అని ఆయన అన్నారు.
Read More: Bigg Boss: బిగ్ బాస్ షోలోకి పోర్న్ స్టార్.. ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు!