Site icon HashtagU Telugu

BJP-Another 6 : మరో 6 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు

BJP

Bjp Another 6

BJP-Another 6 : పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను బీజేపీ మంగళవారం మార్చింది. 

త్వరలోనే మరో 6 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

మరో రెండు రోజుల్లో కేంద్ర  కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణతో పాటే 6 రాష్ట్రాలకు పార్టీ కొత్త అధ్యక్షుల నియామకంపైనా నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. 

ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్ష పదవుల నుంచి వైదొలిగే నాయకులకు కేంద్ర మంత్రులుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చబోతున్న మరో 6 రాష్ట్రాల్లో(BJP-Another 6) మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ ఉన్నాయని తెలుస్తోంది. లోక్‌సభ ఎంపీ అయిన గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎంతో అనుభవజ్ఞుడైన ఆయనకు కేంద్ర మంత్రిగా ఛాన్స్ ఇచ్చి.. గుజరాత్ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని  జాతీయ నాయకత్వం భావిస్తోందట. మధ్యప్రదేశ్ బీజేపీ  అధ్యక్షుడు వీడీ శర్మను కూడా కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది.

Also read : White House-White Powder : వైట్ హౌస్ లో కొకైన్.. ప్రెసిడెంట్ బైడెన్ కొడుకుపై అనుమానాలు ?

వీడీ శర్మ స్థానంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, కైలాష్‌ విజయవర్గియా, ఎంపీ సుమర్‌ సింగ్‌ సోలంకి పేర్లు చర్చకు వస్తున్నట్లు సమాచారం.  వీడీ శర్మ బ్రాహ్మణ వర్గం నుంచి  వచ్చారు. ఈ లెక్కన  అదే వర్గానికి చెందిన నరేంద్ర సింగ్ తోమర్‌కు మధ్యప్రదేశ్ బీజేపీ  అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికలపై ఫోకస్ తో రానున్న రోజుల్లో కొందరు కేంద్ర మంత్రులకు పార్టీకి సంబంధించిన పలు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.