Site icon HashtagU Telugu

AP Deputy Speaker : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుద‌ల‌

AP ASSEMBLY

AP ASSEMBLY

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి (శుక్రవారం) నుంచి సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. కోలగట్ల వీరభద్రస్వామి మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. సోమవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటామని స్పీకర్ ఇప్పటికే ప్రకటించగా..అది ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కోన రఘుపతి కొద్దిసేపు నిర్వహించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాంకు రాజీనామా సమర్పించారు.