EPFO Recruitment 2023: ఈపీఎఫ్ఓలో 2,674ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలున్నాయంటే.!!

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO Recruitment )దేశవ్యాప్తంగా ఉన్న పలు రీజియన్లలో రెగ్యులర్ ప్రాతిపదికన 2674పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 06:41 AM IST

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO Recruitment )దేశవ్యాప్తంగా ఉన్న పలు రీజియన్లలో రెగ్యులర్ ప్రాతిపదికన 2674పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ రిజీయన్లో 39పోస్టులు, తెలంగాణ రీజియన్లో 116పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాదు నిమిషానికి 35 ఆంగ్ల పదాలు, నిమిషానికి 30 హిందీ పదాలు టైప్ చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18ఏళ్ల నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. ఇక రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

కాగా పై అర్హతలున్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏప్రిల్ 26,2023 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 27 ను ప్రారంభం కానున్నాయి. జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ. 700లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రాతపరీక్ష ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. కంప్యూటర్ టైపింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. జీతం నెలకు రూ. 29,900 నుంచి రూ. 92,300లవరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.