Site icon HashtagU Telugu

New Districts: ఏపీలో కొత్త జిల్లాల‌కు ముహూర్తం ఫిక్స్‌..?

cm jagan

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప‌క్రియ ప్రారంభమ‌వుతుంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ మ్యానిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. దీనిపై ఇప్ప‌టికే ప‌లు రకాల సంప్ర‌దింపులు జ‌రిగాయి. అయితే ఎట్ట‌కేల‌కు దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ అవుతోంది. రేపు లేదా ఎల్లుండి నోటీఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాలుంటే..

26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదిశ‌గా ప్ర‌క్రియ‌ ప్రారంభ‌మైన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అర‌కు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం భౌగోళిక రిత్యా చాలా విస్తార‌మైనది కావ‌డంతో..అర‌కు పార్ల‌మెంట్ నియోక‌వ‌ర్గాన‌ని రెండు జిల్లాలుగా చేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అక్క‌డ‌క్క‌డ భౌగోళిక ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు- చేర్పులు ఉంటాయి. మొత్తం మీద ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం కూడ ఒక కొత్త జిల్లాగా రూపుసంత‌రించుకోనుంది. పెరిగిన జ‌నాభాకు అనుగుణంగా ప‌రిపాల‌నను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవ‌స‌ర‌మ‌ని గ‌తంలో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఈ ప్ర‌క్రియ‌కు అన్ని విధాలు సిద్ధ‌మ‌వుతోంది.