Site icon HashtagU Telugu

Job Notification: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Expected Jobs

Jobs employment

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు, విద్యార్థులకు వరుసగా గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇప్పటికే గ్రూప్స్, మెడికల్ విభాగంలో పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.  ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనునున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని, పరీక్షకు హాజరు కావాలని సూచిస్తున్నారు.