తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో (Gurukul) 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల (Gurukul) నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్లో (Online) దరఖాస్తులు స్వీకరించనుంది. పీజీటీ పోస్టులకు రాతపరీక్ష విధానాన్ని ప్రకటించింది.
300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1లో జనరల్‌స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 100 మార్కులకు; పేపర్-2లో బోధన పద్ధతులపై 100మార్కులకు; పేపర్-3లో సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. టీజీటీ (TGT) మినహా మిగతా పోస్టులకు సంబంధించిన సమగ్ర ప్రకటనలు సోమవారం నాటికి వెబ్‌సైట్లో అందుబాటులో పెట్టేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పోస్టులకు ఈనెల 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
Also Read: Harish Rao: ప్రైవేటీకరణ ‘మేకిన్ ఇండియా’ స్పూర్తికి దెబ్బ: రాజ్ నాథ్ కు హరీష్ లేఖ