ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు ఇస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం. రుషికొండ ఫై నిర్మించుకున్న ప్యాలెస్ దగ్గరి నుండి మొదలుపెడితే..ఈరోజు కడప వరకు..అన్ని జిలాల్లో అక్రమంగా జగన్ నిర్మించుకున్న కట్టడాల ఫై వరుసగా నోటీసులు ఇస్తూ వస్తుంది.
ఇప్పటికే తాడేపల్లి లో నిర్మాణం లో ఉన్న వైసీపీ ఆఫీస్ ను కూల్చివేయగా..మిగతా చోట్లా నోటీసు లు ఇస్తూ వస్తున్నారు అధికారులు. ఇప్పటికే వైజాగ్ , అనకాపల్లి తదితర పార్టీ ఆఫీస్ లకు నోటీసులు జారీచేయడంతో.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఇప్పుడు కడప పార్టీ ఆఫీస్ సైతం అక్రమంగా నిర్మించుకున్నారని నోటీసులు జారీ చేసారు. కడప-చెన్నై జాతీయ రహదారిపై సర్వే నంబర్ 424/1లో వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేశారు. రెండెకరాల ప్రభుత్వ స్థలం ఏడాదికి రూ.3 వేలు చొప్పున 33 ఏళ్లకు లీజ్ తీసుకున్నారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని లీజుకు తీసుకున్న వైసీపీ..నిబంధనల అతిక్రమణ, అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మించారని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్లాన్ అప్రూవల్ కూడా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
సామాన్య ప్రజలు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసుకుంటే అన్ని శాఖల అధికారులు వచ్చి..నానా రభస చేస్తారు. అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తారంటూ గొడవ చేస్తారు. కట్టడాన్ని కూల్చేస్తామంటారు. ఇలా విధుల పట్ల ఎంతో అంకితభావం ప్రదర్శించే అధికారులకు ఐదేళ్లుగా రాజప్రాసాదాల మాదిరిగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల భవనాలు కనిపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న 26 భవనాల్లో ఒక్కటి తప్ప, మిగతా 25 చోట్ల అనుమతులే లేవు.
అడ్డగోలుగా చేపట్టిన ఈ భవనాల నిర్మాణ పనులను అడ్డుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అక్రమ నిర్మాణాలను అడ్డుకోని కారణంగా నగరపాలక సంస్థలు ఫీజుల కింద కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాయి. కొన్నిచోట్ల నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, మచిలీపట్నం, కర్నూలు, కడప ఇలా అనేకచోట్ల గత ఐదేళ్లూ వైసీపీనేతల సేవలో పట్టణ ప్రణాళిక అధికారులు తరిస్తూ, అక్రమ నిర్మాణాలను గాలికి వదిలేశారని కూటమి ఆరోపిస్తుంది.
Read Also : Rain Alert : హైదరాబాద్‌కు భారీ వర్షసూచన.. ఉత్తరాంధ్రలోనూ తేలికపాటి జల్లులు