Smart Phones: త్వరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి నథింగ్…కార్ల్ పీ ట్వీట్…!

వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్థాపించిన టెక్ బ్రాండ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతంది. నథింగ్ కంపెనీ తన మొదటి స్మార్ట్ ఫోను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.

  • Written By:
  • Publish Date - February 17, 2022 / 12:06 PM IST

వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్థాపించిన టెక్ బ్రాండ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతంది. నథింగ్ కంపెనీ తన మొదటి స్మార్ట్ ఫోను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. అయితే కంపెనీ దీన్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ కార్ల్ పీ లెటెస్టుగా చేసిన ట్వీటులో దీనికి సంబంధించి చిన్న క్లూ ఇచ్చాడు. బ్యాక్ ఆన్ ఆండ్రాయిడ్ అంటూ ట్వీట్ చేశాడు కార్ల్ పీ.
కాగా ఆండ్రాయిడ్, క్రోమ్ పై రన్ అవుతున్న నథింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి లాక్ మైమర్ ను ట్యాగ్ చేశాడు కార్ల్ పీ. ఈ ట్వీట్ కు ఆండ్రాయిడ్ ఆఫిషీయల్ హ్యాండిల్ రిప్లే ఇచ్చారు. కార్ల్ ఇండియాపై పనిచేసేందుకు తాము రెడీగా ఉన్నామని పేర్కొంది. ఇక ఈ మధ్యే నథింగ్ ఇండియా జీఎం వైస్ ప్రెసిడెంట్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ దీని గురించి ప్రస్తావించారు. స్మార్ట్ ఫోన్ను లాంఛ్ చేసే ప్రాజెక్టుపై తాను పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తమ మార్కెట్ను విస్తరించాలన్న యోచనలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో త్వరలోనే నథింగ్ నుంచి ఓ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వస్తుందన్న రూమర్స్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

https://twitter.com/getpeid/status/1493664344365846539

అంతేకాదు నథింగ్ నుంచి రానున్న తొలి స్మార్ట్ ఫోన్ లో ఉండే ఫీచర్లు కూడా లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ లీకేజీలను బట్టి చూస్తుంటే నథింగ్ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్, ప్రాసెసర్ ను ఉపయోగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇది ఆండ్రాయిడ్ 12ఓఎస్ పై రన్ అవుతుంది. నథింగ్ ప్రస్తుతం ఇయర్ బడ్స్ మార్కెట్లోని ఉండగా…2022 ఏడాదిని కార్ల్ పీ మార్కెట్ విస్తరణకు అనువైన సంవత్సరంగా భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ బ్రాండ్ తో ఐదు కొత్త ప్రొడక్టులను విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు కార్ల్ పీ. ఇందులో భాగంగానే నథింగ్ కంపెనీ 2021లో ఆండీ రూబిన్ కు చెందిన ఎసెన్షియల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ను కొనుగోలు చేసింది. ఇది భవిష్యత్తులో నథింగ్ స్మార్ట్ ఫోన్ విడుదల గురించి మరిన్ని అంచనాలను పెంచేసింది. కార్ల్ తన ప్రొడక్టులను మార్కెటింగ్ చేసేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అందుకే ప్లాన్ ప్రకారం స్మార్ట్ ఫోన్ లాంచింగ్ పై ట్వీట్ చేసినట్లుగా టెక్ అనలిస్టులు భావిస్తున్నారు. నథింగ్ నుంచి రానున్న కొత్త ఫోన్ పై మరింత స్పష్టత రావాలంటే…ఇయర్ 1 వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను విడుదల చేసేవరకు వేచి చూడాల్సిందే.