Site icon HashtagU Telugu

Nothing India : సేవా కేంద్రాలతో సర్వీస్ నెట్ వర్క్ ను విస్తరించిన నథింగ్ ఇండియా

Nothing India has expanded its service network with service centers

Nothing India has expanded its service network with service centers

Service Centers: లండన్ కు చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫోన్ బ్రాండ్ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. పెరుగుతున్న తమ కస్టమర్ లకు మెరుగ్గా సేవలు అందించడానికి తమ సర్వీస్ సెంటర్ నెట్ వర్క్ ను విస్తరించనున్నట్లు నథింగ్ ప్రకటించింది. సైబర్ మీడియా రీసెర్చ్ ప్రకారం, నథింగ్ 2024 మూడవ త్రైమాసికంలో గణనీయంగా 646% వృద్ధిని సాధించింది. ఇది బ్రాండ్ విస్తరణకు మరియు పెరుగుతున్న ప్రజల ఆదరణకు నిదర్శనం. హైదరాబాద్ లో ప్రత్యేకమైన సర్వీస్ సెంటర్ నవంబర్ 25న ప్రారంభించబడింది. తదుపరి నవంబర్ 26న చెన్నై సెంటర్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కంపెనీ ప్రత్యేకమైన సర్వీస్ నెట్ వర్క్ మూడు నుండి అయిదు ప్రాంతాలకు విస్తరించబడనుంది.

“హైదరాబాద్ మరియు చెన్నైలో కొత్త ప్రత్యేక సేవా కేంద్రాలను ప్రారంభించడం ద్వారా మా సేవా నెట్‌వర్క్‌ను విస్తరించడం పట్ల మేము సంతోషిస్తున్నాము” అని నథింగ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ప్రణయ్ రావు అన్నారు. “భారత మార్కెట్‌లో మా వేగవంతమైన వృద్ధితో పాటు అత్యుత్తమ కస్టమర్ సేవ మరియు మద్దతు అందించడానికి మేము కట్టుబడి ఉన్నామనే దానికి ఇది నిదర్శనం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మాకు ఇప్పటికే ఉన్న ప్రత్యేక సేవా కేంద్రాలతో పాటు ఈ కొత్త కేంద్రాలు మా కస్టమర్లకు మా ఉత్పత్తులతో ఉత్తమమైన సంరక్షణ మరియు అనుభవాన్ని అందించడాన్ని నిర్ధారిస్తాయి” అని ఆయన చెప్పారు.

అదనంగా, కంపెనీకి 5 బహుల-బ్రాండ్స్ సర్వీస్ సెంటర్లలో ప్రాధాన్యత గల ప్రత్యేకమైన సర్వీస్ డెస్క్స్ ఉన్నాయి, మరిన్ని రాబోతున్నాయి. కొల్ కత్తా, గురుగ్రామ్, కొచ్చిన్, అహ్మదాబాద్ మరియు లక్నోలలో ప్రాధాన్యతా డెస్క్స్ లు పని చేస్తున్నాయి మరియు మరొక 20 కొత్త ప్రాధాన్యతా డెస్క్ లు త్వరలోనే రాబోతున్నాయి. ఈ సదుపాయాలు కస్టమర్లకు టాప్-టియర్ సర్వీస్ కేటాయిస్తాయి, నిరంతరమైన, వేగవంతమైన మరియు సమర్థవంతమైన అనుభవాన్ని నిర్థారిస్తాయి. నథింగ్ ఇండియా ఇప్పటికే పిక్ అప్ మరియు డ్రాప్ సర్వీసెస్ ను అందిస్తోంది మరియు దేశవ్యాప్తంగా 18,000 పిన్ కోడ్స్ లో సేవలు అందిస్తోంది, విస్తృత శ్రేణి ప్రజలకు సౌకర్యవంతమైన సేవను అందుబాటులో ఉంచుతోంది.

ఈ ప్రత్యేకమైన సర్వీస్ సెంటర్స్ ప్రోడక్ట్ జోన్స్, రిఫ్రెష్ మెంట్స్, రెట్రో గేమింగ్ కన్సోల్స్ మరియు ఇఎస్ డి-అనుగుణమైన మరమ్మతు సదుపాయాలతో విలక్షణమైన బ్రాండ్ అనుభవాన్ని కేటాయిస్తాయి, సగటు 4.8+ గూగుల్ రేటింగ్ మరియు 98% అదే రోజు పరిష్కారం రేటుతో, నధింగ్ వారి ప్రత్యేకమైన సర్వీస్ కేంద్రాలు ఉన్నతమైన నాణ్యత మరియు సమర్థవంతమైన కస్టమర్ సర్వీస్ ను నిర్ధారిస్తాయి.

ఫ్లిప్ కార్ట్, క్రోమా, మరియు విజయ్ సేల్స్ లో , భారతదేశంలోని ఇతర రిటైల్ భాగస్వాములతో ఇప్పటికే లభిస్తున్న నథింగ్ తమ ఆఫ్ లైన్ ఉనికిని రెట్టింపుకు పైగా 2,000 నుండి 5,000 ప్రాంతాలకు పెంచింది మరియు త్వరలోనే భారతదేశంవ్యాప్తంగా 7000 అవుట్ లెట్స్ లో లభిస్తుంది. నథింగ్ ఇండియా వారి విస్తృతమైన సర్వీస్ కవరేజ్ పై మరింత సమాచారం కోసం, దయచేసి కంపెనీ వారి వెబ్ సైట్ ను చూడండి. సేవా కేంద్రం చిరునామా:- H.NO – 1-98/90/25/K, P R హైట్స్, షాప్ నెం – 9, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, మాదాపూర్, మెట్రో పిల్లర్‌కి ఎదురుగా No C 1732, హైదరాబాద్, తెలంగాణ, పిన్ కోడ్ – 500081

Read Also: Samantha Gift : చైతూకు ఇచ్చిన గిఫ్ట్ వేస్ట్ అయ్యింది – సమంత