Site icon HashtagU Telugu

Hijab: హిజాబ్ ధరించి ఎగ్జామ్ కు.. అనుమతించని అధికారులు

Hijab

Hijab

క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ముస్లిం విద్యార్థినులను హిజాబ్ తో తరగతి గదిలోకి అనుమతించాలని కోరుతూ కోర్టులో మొట్టమొదటి పిటిషన్ వేసిన ఇద్దరు విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసేందుకు.. ఉడిపిలోని విద్యోద‌య పీయూ కాలేజీ ఎగ్జామ్ సెంటర్ కు బుర్ఖా లో వెళ్లిన ఆలియా అస‌ది, రేష్మాలను అధికారులు వెన‌క్కి పంపించారు. హిజాబ్ లో పరీక్ష రాసేందుకు అనుమతించాలని వారు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు.సుమారు 45 నిమిషాల పాటు ఆ అమ్మాయిలు ఇన్విజిలేట‌ర్లు, ప్రిన్సిపాల్‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అందుకు ససేమిరా అనడంతో పరీక్షా కేంద్రం నుంచి ఆలియా అస‌ది, రేష్మా మౌనంగా వెనుదిరిగారు. కర్ణాటక లోని కాలేజీల్లో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో 17 ఏళ్ల ఆలియా అసదీ ముందంజలో ఉన్నారు. “మా భవిష్యత్తును నాశనం చేయకుండా ఆపడానికి” తమకు ఇంకా అవకాశం ఉందని పేర్కొంటూ గతవారం ఆమె కర్ణాటక  ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి
ట్వీట్  చేశారు.

Exit mobile version