Rahul and ED: ఆ సంస్థ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు.. రాహుల్ గాంధీ!

ప్రముఖ కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ తాజాగా నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో ఈడి ఎదుట హాజరయ్యారు.

  • Written By:
  • Updated On - June 16, 2022 / 03:14 PM IST

ప్రముఖ కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ తాజాగా నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో ఈడి ఎదుట హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా రాహుల్ గాంధీ ఇండియన్ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపినట్లు సమాచారం. యంగ్ ఇండియన్ లిమిటెడ్ లాభాపేక్ష లేని దాతృసంస్థ అని అది కంపెనీల చట్టం లోని ప్రత్యేక నిబంధన కింద ఏర్పడిందని స్పష్టం చేసినట్టు సమాచారం.

కాగా ఆ సంస్థ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని రాహుల్ గాంధీ ఈడీకి చెప్పినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ వాదనను ఈడి అధికారులు తోసిపుచ్చుతూ 2010లో ఇండియా లిమిటెడ్ ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టలేదు అని సమాచారం. ఒకవేళ యంగ్ ఇండియన్ ద్వారా ధార్మిక పనిచేసి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలను లేకపోతే ఆధారాలను సమర్పించాలి అని అధికారులు రాహుల్ గాంధీ కి సూచించారు.

ఇకపోతే మనీ ల్యాండరింగ్ కేసులో సుదీర్ఘంగా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడల్లా కేంద్రం పై విమర్శలు సైతం గుప్పించారు. కాంగ్రెస్కు ఏజెఎల్ బకాయి పడ్డ 90.25 కోట్ల వసూలు చేసుకునే హక్కునై కేవలం 50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలి అని సోనియా రాహుల్ గాంధీ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఈడి విచారణను ఎదుర్కొంటున్నారు రాహుల్ గాంధీ.