Site icon HashtagU Telugu

RS Praveen Kumar: అసెంబ్లీలో హాస్టళ్ల అభివృద్ధిపై ఏ ఒక్క నాయకుడు మాట్లాడడం లేదు: ఆర్ఎస్

Rs Praveen Kumar

Rs Praveen Kumar

RS Praveen Kumar: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సంక్షేమ హాస్టల్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం సందర్శించారు. సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారి ఎందుకు చేరుతున్నారు. వారిపై అత్యాచారాలు హత్యలు ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశంలో రెండు నిమిషాలు కూడా మౌనం పాటించలేదు. ప్రాజెక్టుల పేరుతో డబ్బులు పెట్టుబడి పెట్టి కమిషన్లు దండుకుంటున్నారు కానీ హాస్టల్లపై అభివృద్ధి చేయాలని ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదని అన్నారు.

ఈనెల 12న శాంతియుత ర్యాలీ ధర్నా హైదరాబాదులో చేపడతాం. ప్రభుత్వం న్యాయం చేయాలి దోషులను జైలుకు పంపాలి. బీఎస్పీ చేపట్టే ధర్నాలో హాస్టల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనాలని అన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వున్న సంక్షేమ హాస్టళ్లలో విద్యను అభ్యసిస్తూ ఉన్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే కథనాలు వినవస్తున్నాయి. తాజాగా భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థినుల అనుమానాస్పద మృతి ఇంకా మిస్టరీ వీడకపోవడం అనుమానాలకు తావు ఇస్తుంది.

వారిది హత్యా? ఆత్మహత్యా? అనేది కొలిక్కి రాలేదు. హాస్టల్ నిర్వహణలో లోపాలు, ఆటో డ్రైవర్ జోక్యంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఎంతో భవిష్యత్తు వున్న ఇద్దరు అమ్మాయిలు భవ్య, వైష్ణవిలు హాస్టల్ గదిలోనే మరణించడం రాష్ట్ర వ్యాప్తంగావున్న వివిధ ప్రభుత్వ హాస్టళ్ల స్థితిగతులను బట్ట బయలు చేస్తోంది.