Site icon HashtagU Telugu

Breaking : జింఖాన గ్రౌండ్స్ లో గాయపడిన మహిళ చనిపోలేదు..యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది-డీసీపీ నార్త్ జోన్

Lati Charge

Lati Charge

సికింద్రాబాద్ జింఖాన మైదానంలో గాయపడిన మహిళ చనిపోలేదు..యశోద లో చికిత్స పొందుతుందని . నార్త్ జోన్ అదనపు డీసీపీ తెలిపారు. క్రీడా శాఖ మంత్రి ముందుగానే స్పందించి ఉంటే ఇలాంటి ఘటన జరగకపోయేదని జనాలు మండిపడుతున్నారు. … అభిమానుల కోసం భారీ కెడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్లు పాటించే విధంగా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు.

నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నెల 25న జరుగనున్న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ప్రధాన గేటు నుంచి అభిమానులు ఒక్కసారిగా తోసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒకరినొకరు తోసుకోవడంతో 20 మంది సృహతప్పిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురవాడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వచ్చే ఆదివారం ఉప్పల్‌ వేధికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్లు మూడో టీ 20లో తపడనున్నాయి. ఈ మ్యాచ్‌ టికెట్లను సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌లో హెచ్‌సీఏ విక్రయిస్తున్నది. దీంతో అభిమానులు పెద్దసంఖ్యలో మైదానానికి తరలివచ్చారు.