No marriage: ఆ ఊర్లోని యువకులెవరికీ పెళ్లిళ్లు కావడం లేదు.. వారికి ఆ సమస్య..!

పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో హాయిగా ఉండాలని చాలామందికి ఉంటుంది. కానీ చాలామందికి ఇటీవల పెళ్లి కావడం లేదు. సరైన ఉద్యోగం లేక ఆస్తులు లేక పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

  • Written By:
  • Updated On - May 24, 2023 / 10:15 PM IST

No marriage: పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో హాయిగా ఉండాలని చాలామందికి ఉంటుంది. కానీ చాలామందికి ఇటీవల పెళ్లి కావడం లేదు. సరైన ఉద్యోగం లేక ఆస్తులు లేక పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంకా కొంతమందిక కులం అడ్డు వస్తుంది. కొన్ని కులాల్లో అబ్బాయిలు ఎక్కువగా ఉండి అమ్మాయిలు తక్కువగా ఉండటం వల్ల పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో చాలామంది అబ్బాయిలకు పెళ్లి కాక బాధపడుతున్నారు.

అయితే ఒక గ్రామంలో యువకులకు అసలు పెళ్లిళ్లు కావడం లేదు. ఆ గ్రామంలోని యువకులెవరికీ పెళ్లి కావడం లేదు. అదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలోకి కత్రా ప్రాంతంలోని పురైనా గ్రామంలో యువకులెవరికీ అసలు పెళ్లి కావడం లేదు. ఎందుకో తెలుసా..?

వెయ్యి కంటే తక్కువ జనాభా ఉన్న పురైనా గ్రామంలో 30 ఏళ్లు దాటినా యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. ఎందుకంటే ఈ ఊరికి కరెంట్ సదుపాయం లేదు. దీంతో అమ్మాయిలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కరెంట్ సదుపాయం ఇప్పటికీ లేకపోవడంతో ఈ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ లేకపోవడంతో ఆ గ్రామం ఇప్పటికీ వెనుకబడి ఉంది. దీంతో ఆ ఊర్లోని పురుషులకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఇక కరెంట్ లేకపోడంతో నీటి సమస్య కూడా ఈ గ్రామానికి ఏర్పడింది. తాగునీటి కోసం గ్రామంలోని ప్రజలు చాలా దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటన్నారు. ఈ గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. గ్రామంలో అసలు మౌలిక సౌకర్యాలు ఏమీ లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గ్రామస్తులు ఒత్తిడి తీసుకురావడంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రజాప్రతినధులు హామీ ఇచ్చారు. దీంతో తమ గ్రామానికి వెలుగులు వస్తాయని అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చాలా ఊర్లకు సరైన కరెంట్, నీటి సదుపాయం లేదు. దీంతో గ్రామాలన్నీ అభివృద్ధిక ఆమడ దూరంలోనే కొనసాగుతున్నాయి.