Site icon HashtagU Telugu

Telangana: నేటితో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ, మొత్తం 2028 నామినేషన్లు దాఖలు

All Parties

All Parties

Telangana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టం పూర్తయింది. ఇవాళ్టీతో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేసన్ గడువు ముగిసింది. ఈ సమయంలోపు ఆర్వో ఆఫీస్ లో ఉన్నవారికి మాత్రమే నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. ఇగ ఈ నెల 13న నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. 15న విత్ డ్రాకు అవకాశం ఉంది. ఈ నెల 30న ఒకే విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2028 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. గురువారం మంచి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు వేశారు. ఈ ఒక్కరోజే రాష్ట్ర వ్యాపత్గా 1133 నామినేషన్లు వచ్చాయి. ఇగ శుక్రవారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేశారు లీడర్లు. ఈ లెక్కన 3వేలకు పైగానే నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఒక్కో అభ్యర్ధి రెండు, మూడు సెట్లు దాఖలు చేశారు. అంతేకాదు తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ తో సైతం నామినేషన్లు వేయించారు అభ్యర్ధులు.  నామినేషన్ కు ఆఖరి తేదీ కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్ ను దాఖలు చేశారు.