Site icon HashtagU Telugu

Chops Students Hair: క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు హెయిర్ కట్ చేసిన ఉపాధ్యాయుడు.. తర్వాత ఏం జరిగిందంటే..?

Chops Students Hair

Resizeimagesize (1280 X 720) 11zon

Chops Students Hair: దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ స్కూల్లో క్రమశిక్షణ పేరుతో చేసిన ఈ చర్యపై సోషల్ మీడియాలో జనాలు పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు. నోయిడాలోని ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం సుమారు 12 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నిరసనతో ఉపాధ్యాయుడిని తొలగించింది. పిల్లలపై క్రమశిక్షణా చర్యగా పాఠశాల ఉపాధ్యాయుడు వారి జుట్టును కత్తిరించడమే (Chops Students Hair) దీని వెనుక కారణం. ఈ ఘటనను స్థానిక పోలీసులు ధృవీకరించారు.

ఈ ఘటన రెండు రోజులు క్రితం అంటే బుధవారం జరిగింది. నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న పాఠశాల ఉపాధ్యాయుడి చేసిన ఈ పనికి ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు చేరుకుని తీవ్ర నిరసన తెలిపారు. డజను మంది నిరసనను చూసిన పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నోయిడా అదనపు DCP శక్తి మోహన్ అవస్తి మాట్లాడుతూ.. సంఘటన గురించి సమాచారం అందుకున్న తరువాత స్థానిక ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్ అధికారులు శాంతి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చేరుకున్నారు. ఈ విషయమై పాఠశాల యాజమాన్యం సుమారు 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. దీని తర్వాత పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వెంటనే రద్దు చేయాలని నిర్ణయించింది.

Also Read: PM Narendra Modi: నేడు నాలుగు రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ.. రూ. 7600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

క్రమశిక్షణ పేరుతో హెయిర్ కట్ చేయడం సబబు కాదు

పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్టును ఎందుకు కత్తిరించిందనే దానిపై అడిషనల్ డిసిపి శక్తి మోహన్ అవస్తి స్పందిస్తూ ఇలా చేసిన ఉపాద్యాయుడు ఆ పాఠశాల క్రమశిక్షణా ఇన్‌ఛార్జ్ అని అన్నారు. చాలా రోజులుగా విద్యార్థులను జుట్టు కత్తిరించాలని కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. వారిని క్రమశిక్షణలో పెట్టడానికి ఉపాధ్యాయులే వారి జుట్టును కత్తిరించారు. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదు. ఉపాధ్యాయుడే క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను కించపరిచే పని చేశాడని తల్లిదండ్రులు అన్నారు.

Exit mobile version