Site icon HashtagU Telugu

Wrestlers Protest: రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు .. లైంగిక కేసులో కీలక మలుపు

Wrestlers Protest

New Web Story Copy 2023 05 31t144710.291

Wrestlers Protest: రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్టుకు సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు ప్రకటించాయి. కొన్నాళ్లుగా రెజ్లర్లు భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం రెజ్లర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీస్తుంది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తమని లైంగికంగా వేధిస్తున్నాడని నెలరోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా నిరసనకు దిగారు. రెజ్లర్లకు ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, ఆప్ సంఘీభావం తెలిపాయి. తాజాగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేశారు. వారికి సంఘీభవంగా రైతు నాయకుడు రాకేష్ టికాయత్ మద్దతు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉండగా ఈ రోజు ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాకిచ్చారు.

రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్టుకు సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే బ్రిజ్ భూషణ్‌పై చార్జిషీటు దాఖలు కాకుండా తుది నివేదికను దాఖలు చేయనున్నన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది రెజ్లర్లకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. మరోవైపు భూషణ్ ఈ రోజు సంచలన ప్రకటన చేశాడు. నాపై ఒక్క ఆరోపణ అయినా రుజువైతే నేనే ఉరి వేసుకుంటానని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.

Read More: Balineni : జ‌గ‌న్ పొలిటిక‌ల్ రివ్యూ, బాలినేని దారెటు?