దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధిచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గత వారం హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.అనేక రాష్ట్ర ప్రభుత్వాలు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూ విధిస్తూ.. వేడుకలను నిషేధించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వేడుకలపై ఎలాంటి నిబంధనలను జారీ చేయలేదు. కేవలం పబ్లిక్ మీటింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓమిక్రాన్ డెల్టా వారియెంట్ కంటే మూడు రేట్లు ఎక్కువ వ్యాప్తి చెందుతున్న నేపథ్యం హై కోర్టు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విధించినట్టు ఆంక్షలు విధిచాలని ఆదేశించింది. ప్రభుత్వం నుండి ఎటువంటి నిబంధనలు రాకపోవడంతో పబ్ యాజమాన్యం యధావిధిగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు సిద్దమౌతున్నాయి.
Telangana: యధావిధిగా న్యూ ఇయర్ వేడుకలు?

Template (79) Copy