Dance Bars: గోవాలో డ్యాన్స్ బార్‌లకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు

గోవాలో డ్యాన్స్ బార్‌లకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. గోవాలో అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్

Dance Bars: గోవాలో డ్యాన్స్ బార్‌లకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. గోవాలో అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అడిగిన ప్రశ్నకు సావంత్ సమాధానమిస్తూ రెస్టారెంట్ల ముసుగులో డ్యాన్స్ బార్‌లు నిర్వహించడం లేదని సీఎం క్లారిటీ ఇచ్చారు.

గోవాలోని కలంగుట్‌ నియోజవర్గంలో యదేచ్చగా డ్యాన్స్ బార్లు సాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర గోవాలోని కలాంగుటే మరియు తీరప్రాంతానికి చెందిన సుమారు 500 మంది స్థానికులు ‘డ్యాన్స్ బార్’ సంస్కృతి, డ్రగ్స్ మరియు వ్యభిచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు మరియు దానిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవా పేరు చెడగొడుతున్న ‘డ్యాన్స్ బార్’ సంస్కృతిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. డ్యాన్స్‌ బార్‌’ వల్ల ఆ ప్రాంతంలో ఆడపిల్లలే కాదు, అబ్బాయిలకు కూడా భద్రత లేదని వాపోతున్నారు. సాయంత్రం వేళల్లో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More: MInister Roja : పవన్ కళ్యాణ్ ఫై విరుచుకుపడ్డ మంత్రి రోజా