Site icon HashtagU Telugu

Kodali Nani: జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు: కొడాలి నాని

Kodalinani Ap

Kodalinani Ap

Kodali Nani: గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ, జోహార్ వైయస్ఆర్.. జై జగన్… జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు.

సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పార్టీ పెట్టిన తర్వాత, జరిగిన ప్రతి ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలుస్తూ సీఎం జగన్ సత్తా చాటుకున్నాడని ఎమ్మెల్యే నాని అన్నారు.14ఏళ్ల పాటు ఒడుదుడుకులు ఎదురకున్న సీఎం జగన్ నేడు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచారన్నారు. వైసిపి ఎదుర్కొనే మూడో ఎన్నికలో జగన్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్ ,పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి. నారాయణరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్ట నాగమణి జాన్ విక్టర్ ,వైఎస్ఆర్సిపి నాయకులు పాలేటి చంటి, సింగిరెడ్డి గగారిన్, చింతల భాస్కరరావు , రమణ కుమార్, ఎస్సీ సెల్ చైర్మన్ రేమల్లి నీలాకాంత్, మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ బాజీ,అలి బెగ్, అబ్దుల్లా బెగ్,కలపాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version