Hijab: కర్ణాటకలో హిజాబ్ పై నిషేధం ఎత్తివేత..

మహిళలు ఏ డ్రస్ వేసుకుంటారు ? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగత ఎంపికని చెప్పారు. వారిని ఎవరూ అడ్డుకోరన్నారు. కాగా.. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి..

  • Written By:
  • Updated On - December 22, 2023 / 10:36 PM IST

Hijab: హిజాబ్ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజాబ్ ధరించడంపై ఎలాంటి నిషేధం ఉండదని వెల్లడించింది. హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మైసూర్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హిజాబ్ పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో మహిళలు తమకేది నచ్చితే దానిని ధరించవచ్చని తెలిపారు. హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లొచ్చని.. హిజాబ్ పై బ్యాన్ ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు.

మహిళలు ఏ డ్రస్ వేసుకుంటారు ? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగత ఎంపికని చెప్పారు. వారిని ఎవరూ అడ్డుకోరన్నారు. కాగా.. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హిజాబ్ ను బ్యాన్ చేశారు. దానిపై కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. హిజాబ్ విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరిగా ధరించాలన్న నియమం ఏమీ లేదని పేర్కొంది. విద్యాసంస్థల్లో మాత్రం యూనిఫారమ్ ను ధరించాల్సిందేనని చెప్పింది. తాజాగా సిద్ధరామయ్య ప్రభుత్వం హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు.