హైదరాబాద్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టార్ హోటళ్లు, రిజిస్టర్‌డ్ క్లబ్‌లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లను మూసివేయనున్నట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు మినహా మద్యం దుకాణాలను మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.