Site icon HashtagU Telugu

Alia Ranbir Honeymoon: ఆలియా , రణ్ బీర్ హనీమూన్ ప్లాన్ వాయిదా !

alia ranbir

alia ranbir

పెళ్లితో ఈనెల 14న ఒక్కటైన ఆలియా భట్ , రణ్ బీర్ కపూర్ దంపతుల హనీమూన్ ప్లాన్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. వారిద్దరూ హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లబోతున్నారు ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమకు ఎంతో ఇష్టమైన సౌత్ ఆఫ్రికా సఫారీలను చూసేందుకు ఆలియా భట్ , రణ్ బీర్ కపూర్ వెళ్తారనే టాక్ కూడా వచ్చింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. హనీమూన్ ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆలియా , రణ్ బీర్ నిర్ణయించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు.

2022 సంవత్సరం అక్టోబరు 2న విడుదల కానున్న “Animal” సినిమా షూటింగ్ కు సమయం కేటాయించాలని రణ్ బీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఫిబ్రవరి 10న రిలీజ్ కానున్న ” రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ” మూవీ కోసం షెడ్యూల్ను కేటాయించాలని ఆలియా నిర్ణయించినట్లు సమాచారం.