Hyderabad: ప్రేక్షకుల లేకుండానే ప్రపంచ కప్ వామప్ మ్యాచ్

రెండు వారాల్లో వరల్డ్ కప్ మానియా ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ పోటీల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Hyderabad: రెండు వారాల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ పోటీల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బీసీసీఐ కూడా ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రపంచ కప్ లో జరిగే కొన్ని మ్యాచ్ లకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఉప్పల్ స్టేడియంలో తొలి వామప్ మ్యాచ్ ఈనెల 29న జరగనుంది. ఈ వామప్ మ్యాచ్ లో పాకిస్థాన్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ చూడ్డానికి ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదు. కారణం ఏంటంటే మ్యాచ్ కు ఒకరోజు ముందు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగలు జరుగుతాయి.

రెండు పండగలకు భారీగా పోలీస్ బందోబస్త్ అవసరం పడుతుంది. ఈ నేపథ్యంలో తొలి వామప్ మ్యాచ్ కు భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. పైగా పాకిస్థాన్ తో మ్యాచ్ కాబట్టి భద్రత అవసరం ఉంటుంది. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అసోసియేషన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ లో జరగనున్న వామప్ మ్యాచ్ తేదీలను మార్చాలని మొదటి నుండి హైదరాబాద్ పోలీసులు చెప్తూనే ఉన్నారు దీనిపై బీసీసీఐ-హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్చించాయి. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు.

Also Read: AP : వివేకాహత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు..