Site icon HashtagU Telugu

No Entry: పొట్టి బట్టలు వేసుకుంటే ఆ ఆలయాల్లోకి నో ఎంట్రీ!

రెచ్చగొట్టే పొట్టి బట్టలు వేసుకొని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటున్నారా.. అయితే అలర్ట్ గా ఉండండి. ఎందుకంటే షార్ట్ దుస్తులు వేసుకుంటే ఆలయాల్లోని అనుమతించకపోవచ్చు. ఎందుకంటే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ జిల్లాల్లోని కొన్ని ఆలయాల్లో ఇలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. భక్తులు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించకపోతే అనుమతించరు. ట్రాక్ లు, టాప్స్, షార్ట్స్ లాంటివి ధరించి ఆలయానికి వచ్చే భక్తులపై నిషేధం విధించారు. ఆలయ నిర్వాహకులు ఈ ఆంక్షలు విధించారు. మహిళలు తమ శరీరాన్ని 80% కప్పుకోవాలి. అప్పుడే ఆలయంలోకి అనుమతి ఉంటుంది.

దక్ష ప్రజాపతి ఆలయం (హరిద్వార్), తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం (డెహ్రాడూన్) మరియు నీలకంఠ మహాదేవ్ ఆలయం (రిషికేశ్) ‘సాధారణ దుస్తులు ధరించిన పురుషులు, మహిళలు’ ఇద్దరి ప్రవేశాన్ని అధికారికంగా నిషేధించినట్లు మహానిర్వాణి పంచాయతీ అఖారా కార్యదర్శి మహంత్ రవీంద్ర పూరి తెలిపారు. 80 శాతం దేహాన్ని కప్పి ఉంచే మహిళలను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ‘కొన్నిసార్లు దేవాలయాల్లోకి ప్రవేశించే వ్యక్తులు చాలా తక్కువ దుస్తులు ధరించి వారి వైపు చూడడానికి కూడా సిగ్గుపడతారు’ అని అంటున్నారు.

Also Read: Kavitha Kalvakuntla: కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు: దశాబ్ది వేడుకల్లో కవిత!