Site icon HashtagU Telugu

No Entry Fee : ప‌దిరోజుల పాటు చార్మినార్, గోల్కొండ కోటలో ఎంట్రీ ఫీజు లేదు

Charminar

Charminar

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చార్మినార్, గోల్కొండ కోటకు ప్ర‌వేశ రుసుము లేకుండానే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. భారత పురావస్తు శాఖ (ASI) ఆధ్వ‌ర్యంలో ఉన్న అన్ని ఇతర స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాలను సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత ప్రవేశం ఆగస్టు 5 నుండి 15 వరకు చెల్లుతుంది. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు స్మారక చిహ్నాలు ఉన్నాయి. వీటిలో రేప‌టి నుంచి(ఆగ‌ష్టు 5 నుంచి 15వ తేదీ వ‌ర‌కు) ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించ‌నున్న‌ట్లు కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version