Karnataka: కొందరు న్యూస్ యాంకర్లు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ నాయకులెవరూ హాజరుకాకూడదని ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ నిర్ణయించింది. అందులో భాగంగా 14 న్యూస్ చానళ్లను నిషేదించింది. తమపై ద్వేషపూరిత వార్తలు ప్రచురిస్తున్నారన్న నెపంతో కూటమి సదరు చానళ్లపై కొరడా ఝళిపిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ అజ్ తక్ ఛానెల్ పై చర్యలకు సిద్ధమైంది. ఈ సమయంలో కోర్టు మరోరకంగా తీర్పునిచ్చింది.
ఆజ్ తక్ న్యూస్ ఛానెల్ కన్సల్టింగ్ ఎడిటర్ సుధీర్ చౌదరిపై అక్టోబర్ 3 వరకు ముందస్తు చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. కాగా సుధీర్ చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ చందన్‌గౌడ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సాయంత్రం 4 గంటలకు లిస్ట్ చేసింది. అయితే సమయాభావం కారణంగా కోర్టులో వాదనలు వినిపించలేదు.
కర్ణాటక ప్రభుత్వం మైనారిటీలను ప్రసన్నం చేసుకుంటోందని ఆజ్ తక్ ఛానెల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. దాంతో ప్రభుత్వం స్పందించింది. సుధీర్ చౌదరి తన ఛానెల్‌లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా మత సామరస్యానికి విఘాతం కలిగించారని ఆరోపించారు. అందులో భాగంగా సుధీర్ చౌదరి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివకుమార్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ మేరకు సెక్షన్ 153A మరియు ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read:AP : వివేకాహత్య కేసులో భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు..