Site icon HashtagU Telugu

AP News: అనంతపురం జిల్లాలో అంబులెన్స్ ల కొరత, బైక్ పై బాలుడి శవం తరలింపు

Fire Accident

Dead Body

AP News: అనంతపురం జిల్లాలో అంబులెన్సల కొరత ఏర్పడింది. ఫలితంగా పేద ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విష జ్వరంతో బాలుడు మృతి చెందాడు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ద్విచక్ర వాహనంపై బాలుడు శవాన్ని బంధువులు తీసుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురిని కంటతడి పెట్టించింది.  నిరుపేద కుటుంబంలో పుట్టినందుకు విష జ్వరానికి బలయ్యాడు.

మడకశిర అమరాపురం మండల పరిధిలోని హనుమంతనపల్లి గ్రామంలో నివసిస్తున్న రాధమ్మ భర్త పాత లింగప్పకు జన్మించిన ఋషి 5 సంవత్సరాలు. విష జ్వరంతో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు  విష జ్వరంతో నలుగురు వరకు మృతి చెందినట్లు సమాచారం. బాలుడు ఋషి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న ఘటనను చూసిన ప్రజలు ఎమోషన్ అయ్యారు. మడకశిర నియోజకవర్గంలో మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందితే వారిని పట్టించుకోని నాధుడే కరువయ్యారు.

Also Read: TTD: తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు