Indigo: ఇండిగో విమానంలో ఏసీ బంద్.. ప్రయాణికుల చెమట తుడుచుకోవడానికి టిష్యూలు సరఫరా?

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా విమానాలు సాంకేతిక లోపాల వల్ల ఆగిపోవడం లేదంటే ఏవైనా సమస్యలు ఏర్పడడం లాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తు

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 03:45 PM IST

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా విమానాలు సాంకేతిక లోపాల వల్ల ఆగిపోవడం లేదంటే ఏవైనా సమస్యలు ఏర్పడడం లాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా ప్రయాణికులకు ఒక చేను అనుభవం ఎదురయింది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌ కండిషన్‌ ఆన్‌కాకముందే విమానం గాల్లోకి ఎగిరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ శనివారం సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ గా మారింది. చండీగఢ్‌ నుంచి జైపుర్‌ కు వెళ్లిన ఇండిగో విమానం 6E7261లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట మండే ఎండలో సుమారు 10-15 నిమిషాలు క్యూలో ఉండేలా చేశారు. తర్వాత ఏసీలు ఆన్‌ చేయకుండానే విమానం బయల్దేరింది. టేకాఫ్‌ నుంచి ల్యాండిగ్‌ వరకు ఏసీని ఆన్‌ చేయలేదు. దీంతో ప్రయాణికులు చాలా అవస్థపడ్డారు. కానీ, ఆ విషయం గురించి ఎవరూ విమాన సిబ్బంది వద్ద ప్రస్తావించలేదు.

కొందరైతే వేడికి తట్టుకోలేక చల్లగా ఉండేందుకు కాగితాలతో విసురుకొన్నారు. ప్రయాణికులు చెమటను తుడుచుకోవటానికి ఎయిర్‌ హోస్టెస్‌ టిష్యూ పేపర్లను ఉచితంగా అందించింది అని అమరీందర్ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఎయిర్ కండిషనింగ్ లేకుండా విమానం లోపల కూర్చోబెట్టడం వల్ల ప్రయాణికులకు 90 నిమిషాల పాటూ తీవ్రంగా ఇబ్బందిపడినట్లు తెలిపారు. కాగా అందుకు సంబందించిన వీడియోను పౌర విమాన సర్వీసుల నియంత్రణ సంస్థ డీజీసీఏకు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ట్యాగ్‌ చేస్తూ.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌తోపాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరీందర్‌ కోరారు.