Site icon HashtagU Telugu

Patna Meeting Postponed : పాట్నాలో విపక్షాల మీటింగ్ వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..

Nitish Kumar

Nitish Kumar

బీహార్ లోని పాట్నా వేదికగా జూన్ 12న జరగాల్సిన బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశం జూన్ 23కు(Patna Meeting Postponed) వాయిదా పడింది. కాంగ్రెస్, డీఎంకే పార్టీల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఈమేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రసుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూన్ 15 నాటికి ఇండియాకు తిరిగొచ్చే అవకాశం ఉంది. ఇక సోనియా గాంధీ కూడా వైద్య చికిత్స నిమిత్తం విదేశాల్లోనే ఉన్నారు. సోనియాకు తోడుగా ప్రియాంకా గాంధీ కూడా వెళ్లారు.

Also read : Patna Meeting : అశోకుడి గడ్డపై విపక్షాల సమరశంఖం.. ఆ రోజే ?

ఇటువంటి తరుణంలో విపక్షాల మీటింగ్ ను జూన్ చివరి వారంలో నిర్వహిస్తే బాగుంటుందని నితీష్ కుమార్ కు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించినట్టు తెలుస్తోంది. జూన్ 12న తమిళనాడులో ప్రభుత్వపరమైన ప్రోగ్రామ్స్ ఉన్నందున ఆరోజున పాట్నాకు రాలేనని డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ కూడా చెప్పారట. ఈనేపథ్యంలో అన్ని పార్టీలకు సమాచారం అందించి పాట్నా మీటింగ్ తేదీని జూన్ 23కు(Patna Meeting Postponed) నితీష్ కుమార్ మార్చారని అంటున్నారు.