Site icon HashtagU Telugu

Nitish Kumar: రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. బీజేపీకి మద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న నితీష్ కుమార్‌!

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: మణిపూర్‌లో రాజకీయ కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఇక్కడ నితీష్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) బుధవారం బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. JDU 2022 నుండి రాష్ట్రంలో NDAలో భాగమని తెలిసిందే. అయితే రెండేళ్ల తర్వాత JDU పాలక ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. సమాచారం ప్రకారం JDUకు.. మ‌ణిపూర్‌ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయ‌న ఇప్పుడు ప్రతిపక్షంలో భాగం అవుతారు. నవంబర్ 2024లో NPP NDA నుండి తన మద్దతును ఉపసంహరించుకుంది. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్ ప్రభుత్వానికి నితీష్ మద్దతు ఉపసంహరించుకున్నారు. మణిపూర్‌లో ఎన్. బీరెన్‌సింగ్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. జేడీయూలో 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. ఎందుకంటే 60 సీట్ల అసెంబ్లీలో బీజేపీకి 32 సీట్లు ఉన్నాయి. మెజారిటీ కంటే ఎక్కువ సీట్లే బీజేపీ ద‌గ్గ‌ర ఉన్నాయి. అయితే కేంద్రంతో పొత్తులో ఉన్న నితీష్ కుమార్ మ‌ణిపూర్‌లో ఎందుకు బీజేపీకి మ‌ద్ద‌తు ఉప‌సంహరించుకున్నార‌నేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.

Also Read: ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. టాప్‌లో బుమ్రా, జ‌డేజా

మణిపూర్ ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ జేడీయూ లేఖ విడుదల చేసింది. ఇకపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి జేడీయూ మద్దతివ్వదని మణిపూర్ జేడీయూ యూనిట్ ప్రెసిడెంట్ క్షేత్రమయూమ్ బీరెన్ సింగ్ అన్నారు. తన ఏకైక ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ నాసిర్‌ను సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరిగణించాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

2022లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుంది

2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అధికార బీజేపీ బలపడింది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల కేసు భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్ జేడీయూ యూనిట్ మద్దతు ఇవ్వదని, మా ఏకైక ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ నాసిర్‌ను సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరిగణిస్తారని జేడీయూ నాయ‌కులు పేర్కొన్నారు.