Nirmal: వాహన భీమా సొమ్ము క్లయిమ్ కోసం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడి యాజమానికి లబ్ది చేకూర్చేందుకు యత్నించిన నిర్మల్ రూరల్ ఎస్. ఐ కె. చంద్రమోహన్ సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి ఏ. వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దారుడు కారును ఢీ కొట్టిన సంఘటనలో సదరు ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సంఘటన గత ఫిబ్రవరి 2 రెండవ తేదీన జరిగింది. కాని ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన కారు సంబంధించిన వాహన భీమా గడువు ముగియడంతో… కారు యజమాని ఫిబ్రవరి 3వ తేది కారు భీమా రెన్యూవల్ చేయించడంతో సదరు రోడ్డు ప్రమాదానికి గురైన కారుకు భీమా వర్తింపు వచ్చే విధంగా సస్పెండ్ అయిన ఎస్. ఐ చంద్రమోహన్ జరిగిన వాస్తవాలను దాచారు.
కారును ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన సంఘటన ఫిబ్రవరి 6 వ తేదీన జరిగినట్లుగా ఫిబ్రవరి 13 వ తేదీన కారు యాజమానికి లబ్ది చేకూర్చే విధంగా వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం సస్పెండ్ అయిన ఎస్. ఐ గతంలో సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్. ఐ గా పనిచేసే సమయంలో జూద గృహలను ప్రోత్సహించినట్లుగా ఆరోపణలు రావడంతో ఉన్నత పోలీస్ అధికారులు ఎస్.ఐ ని మందలించిన ఎస్. ఐ లో ఎలాంటి మార్పు రాక పొగా పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నట్లుగా నిర్మల్ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్మల్ రూరల్ ఎస్.ఐ కె. చంద్రమోహన్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐ జి పి 1 ఏ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారిచేశారు.