Site icon HashtagU Telugu

Girl Sucide : స్కూల్‌కి వెళ్ల‌డం ఇష్టంలేక‌ తొమ్మిదేళ్ల బాలిక‌…?

Sucide Imresizer

Sucide Imresizer

పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేక 9 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఈ ఘటన హైద‌రాబాద్‌ బేగంపేటలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆరు రోజులుగా స్కూల్‌కి వెళ్ల‌డం లేదు. బాలిక తల్లి గీత సమీపంలోని ఇళ్లలో పనిమనిషిగా పనిచేసేది. గీత ప‌నికి వెళ్లిన తర్వాత బాలిక‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త‌న సోద‌రి మృత‌దేహం చూసి మృతురాలి సోద‌రుడు గ‌ట్టిగా అర‌వ‌డంతో స్థానికులు అక్క‌డి చేరుకుని బాలికని కింద‌కు దించారు. బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృత‌దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బాలికకు శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని ఆమె తల్లికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.