Ladakh Accident: 9 మంది జవాన్లు మృతి.. రక్షణ మంత్రి దిగ్భ్రాంతి

లడఖ్ లో ఘోర ప్రమాదం (Ladakh Accident) జరిగింది. ఖేరి పట్టణానికి 7 కిలోమీటర్ల సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Ladakh Accident

Compressjpeg.online 1280x720 Image 11zon

Ladakh Accident: లడఖ్ లో ఘోర ప్రమాదం (Ladakh Accident) జరిగింది. ఖేరి పట్టణానికి 7 కిలోమీటర్ల సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది జవాన్లు, ఒకరు జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. లద్ధాఖ్ ఖేరీ ప్రాంతం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్మీ వాహనంలో 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

లడఖ్ రక్షణ అధికారి మాట్లాడుతూ.. కేరీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో వారి వాహనం కాలువలో పడిపోవడంతో భారత సైన్యానికి చెందిన 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సైనికులు కరూ దండు నుండి లేహ్ సమీపంలోని కెర్రీ వైపు కదులుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

10 మంది సిబ్బందితో ఆర్మీ వాహనం లేహ్ నుంచి న్యోమాకు వెళ్తుందన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయిందని తెలిపారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సైనికులందరినీ ఆర్మీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎనిమిది మంది సిబ్బంది మరణించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరో జవాన్ చనిపోయారు.

Also Read: Samantha : తల్లితో కలిసి అమెరికా వెళ్లిన సమంత.. ట్రీట్మెంట్ కోసమేనా?

గాయపడిన సైనికులను ఆసుపత్రిలో చేర్చారు

గాయపడిన సైనికులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన ఇతర సమాచారం ఇంకా అందలేదు.

ప్రమాదంపై రాజ్‌నాథ్‌సింగ్ విచారం వ్యక్తం

లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారత ఆర్మీ జవాన్లు మృతి చెందడం బాధాకరం అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. మన దేశానికి వారు చేసిన సేవలను ఎప్పటికీ మరచిపోలేం. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని విచారం వ్యక్తం చేశారు.

  Last Updated: 20 Aug 2023, 06:35 AM IST